AP Jobs: గ్రామ సచివాలయాల్లో5160 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. పూర్తి వివరాలివే
AP Government Jobs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆర్బీకే (RBK)లో పశు సంవర్థక శాఖ సహాయకులను నియమించాలని సీఎం జగన్ (CM Jagan) అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న 5160 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశువైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ఒకే రీతిలో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment