భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎన్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 284
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిషిప్
విభాగాలు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఆర్ అండ్ ఏసీ, ఎంఎంవీ, టర్నర్, మెషినిస్ట్, ఎంఎం టూల్ మెయింటెనెన్స్, కార్పెంటర్, కోపా, ప్లంబర్, SMW, వెల్డర్, పెయింటర్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణత. అభ్యర్థులు ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7,700 - రూ.8,050 వరకు చెల్లిస్తారు.
అప్రెంటిస్ కాలవ్యవధి: ఏడాది.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కుల మెరిట్
ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ అభ్యర్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ అభ్యర్థులకు కేటాయించనున్నారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
27.09.2022.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.10.2022.
* ధ్రువపత్రాల పరిశీలన: 20.10.2022 28.10.2022.
* ధ్రువపత్రాల పరిశీలన వేదిక:
ELECTRONICS CORPORATION OF INDIA
LIMITED,
Corporate Learning & Development Centre (CLDC),
Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad - 500 062.
0 comments:
Post a Comment