NABARD Recruitment 2022: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 177 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డెవలప్మెంట్ అసిస్టెంట్, డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులు ఉన్నాయి. డీగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగినవారు అక్టోబర్ 10 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 177
ఇందులో డెవలప్మెంట్ అసిస్టెంట్ 173 (జనరల్ 80, ఎస్సీ 21, ఎస్టీ 11, ఓబీసీ 46, ఈడబ్ల్యూఎస్ 15), డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ 4 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేయాలి. హిందీ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థులు 21 నుంచి 35 ఏళ్ల మధ్య
వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 15, 2022
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10, 2022
• పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nabard.org/
0 comments:
Post a Comment