Job Vacancies : భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మొత్తం 955 ట్రేడ్ అప్రెంటిస్, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతితోపాటు ఐటీఐ,డిప్లొమా,సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు స్టైపెండ్‌గా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ రూ.8,766ల నుంచి రూ.10,019 వరకు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ రూ.15028, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ రూ.12524, ఎక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ రూ.12524 చెల్లిస్తారు. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ కింది విధంగా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31,2022గా నిర్ణయించారు. హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2022 సాయంత్రం 5 గంటల లోపు అందేలా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in/ పరిశీలించగలరు
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment