ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నెల్లూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన 19 మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టును బట్టి పదోతరగతి/ ఎంబీబీఎస్/బీఎస్సీ నర్సింగ్/యూజీ/పీజీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు దరఖాస్తు దారుల వయసు జులై 31, 2022 నాటికి 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆఫ్లైన్ విధానంలో ఆగస్టు 23, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.250లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది.
వికలాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. జీతం నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తీ వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.. https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/
0 comments:
Post a Comment