IRCTC Recruitment 2022: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

IRCTC Recruitment 2022: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లోని నామినేటెడ్ మొబైల్/ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో హాస్పిటాలిటీ మానిటర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 60 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పై తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-08-2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అభ్యర్థులను విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్‌ నగర్, భువనేశ్వర్, ఒడిశాలో 24-08-2022, 25-08-2022 నిర్వహిస్తారు.

* హైదరాబాద్‌లో ఇంటర్వ్యూను 27-08-2022, 28-08-2022 తేదీల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్‌-రో, విద్యానగర్, డీడీ కాలనీ అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 జీతంగా చెల్లిస్తారు.


వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top