TS Health Department Recruitment 2022: తెలంగాణలో మరో 1326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైద్యారోగ్య శాఖ పరిధిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్ ఖాళీలు, ఐపీఎంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 21 నుంచి ప్రారంభంకానున్నాయి. పాత నోటిఫికేషన్ ప్రకారం జులై 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. తాజాగా హెల్త్ డిపార్ట్‌మెంట్ సవరణ ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో 1,326 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు నివేదించారు. తొలి దశలో 1,326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ నియామక బోర్డు, నిమ్స్ బోర్డు, ఆయుష్ ద్వారా త్వరలో మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ను సందర్శించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1326
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్) పోస్టులు- 751
ట్యూటర్ల (మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్) పోస్టులు- 357
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్) పోస్టులు- 211
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) పోస్టులు- 7
ముఖ్య సమాచారం:
విద్యార్హత: దరఖాస్తు చేసుకొనే అభ్యర్తులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: జులై 15, 2022
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 14, 2022
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment