హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(Hindustan Aeronautical Limited) లో పులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ఇంజినీరింగ్/ఇతర గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ కింద తెలిపిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ లో ఈ పోస్టుల నియామాకాలు చేపడుతోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 10, 2022. పోస్టులు, విద్యార్హత, తదితర వివరాల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టులు ..
1. ఇంజనీరింగ్/ఇతర గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్
3 .ITI ట్రేడ్ అప్రెంటీస్
మొత్తం సీట్లు - 633
విద్యార్హత మరియు అనుభవం
ఇంజనీరింగ్/ఇతర గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు -
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు BE/B.Tech చేసి ఉండాలి. (ఏరోనాటికల్ / కంప్యూటర్ / సివిల్ / ఎలక్ట్రికల్ / E & TC / మెకానికల్ / ప్రొడక్షన్ లేదా B.Pharm/B.Sc (నర్సింగ్) తప్పనిసరి. అభ్యర్థులు సంబంధిత పోస్ట్‌లో కనీస అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి తమ విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. ఈ అప్రెంటిస్ పోస్టులు మొత్తం 99 ఖాళీగా ఉన్నాయి.టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏరోనాటికల్ / కంప్యూటర్ / సివిల్ / ఎలక్ట్రికల్ / ఈ అండ్ టిసి / మెకానికల్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. లేదా DMLT లేదా హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా అవసరం. అభ్యర్థులు సంబంధిత పోస్ట్‌లో కనీస అనుభవం కలిగి ఉండాలి.అభ్యర్థులు అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి తమ విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులు 79 ఖాళీగా ఉన్నాయి.ITI ట్రేడ్ అప్రెంటీస్ -
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత పోస్ట్‌లో కనీస అనుభవం కలిగి ఉండాలి.అభ్యర్థులు అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి తమ విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస పోస్టుల కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మొత్తం ఈ పోస్టులు 455 ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి వీటని దగ్గర ఉంచుకోవాలి. అవేంటంటే..
రెజ్యూమ్ (బయోడేటా)
10వ, 12వ మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు
స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్
కుల ధృవీకరణ పత్రం (వెనుకబడిన తరగతి అభ్యర్థులకు)
గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్)
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment