Job Mela | ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా

Job Mela: ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరుచూ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.రాష్ట్రంలోని పలు చోట్ల జాబ్‌ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌ మేళాను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న విశాఖపట్నంలో జరగనున్న జాబ్‌మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* జాబ్‌మేళాలో భాగంగా యోకోహమా (YOKOHAMA) సంస్థలో మొత్తం 1000 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో IAT (ఇండస్ట్రియల్ అప్రంటీస్ ట్రైనీ) విభాగంలో 500 ఖాళీలు, WAT (ఉమెన్‌ అప్రంటీస్‌ ట్రైనీ) 500 ఖాళీలు ఉన్నాయి.

* ఐఏటీ పోస్టులకు ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, డీజిల్ మెకానిక్) చేసిన అభ్యర్థులు అర్హులు.

* ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ పోస్టులకు మూడేళ్ల డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఈ లింక్‌ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

* రిజిసర్ట్‌ చేసుకున్న అభ్యర్థులు ఈ ఈనెల 18న ఉదయం 10 గంటలకు జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు అచ్యుతాపురం, వైజాగ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.

* జాబ్‌మేళాకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్‌, స్టడీ సర్టిఫికేట్స్‌ జిరాక్స్‌లు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను ఏపీఎస్‌ఎస్‌డీసీ డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌, కంచెర్ల పాలెం, విశాఖపట్నం 530007 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం 7989158111 నంబర్‌ను సంప్రదించాలి.

Join the WhatsApp group below for different types of job notifications

https://chat.whatsapp.com/EGELAeZOzAaAN8lsmQGFPi

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top