APSSDC Job Mela: ఆంధ్రప్రదేశ్‌లో 1000 ఉద్యోగాలు భర్తీ.. జీతం, ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ, అడ్రస్‌ తదితర వివరాలివే

AP Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) తరుచూ జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు చోట్ల జాబ్‌ మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌ మేళాను నిర్వహణకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. జూలై 18న విశాఖపట్నంలో ఈ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు.

ముఖ్యసమాచారం:
ఈ జాబ్‌మేళాలో భాగంగా యోకోహమా (YOKOHAMA) సంస్థలో మొత్తం 1000 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో IAT (ఇండస్ట్రియల్ అప్రెంటిస్ ట్రైనీ) విభాగంలో 500 ఖాళీలు, WAT (ఉమెన్‌ అప్రెంటిస్‌ ట్రైనీ) 500 ఖాళీలు ఉన్నాయి.

IAT (ఇండస్ట్రియల్ అప్రంటీస్ ట్రైనీ): ఈ విభాగంలో 500 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, డీజిల్ మెకానిక్) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు 2018-2021 మధ్య పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లయ్‌ చేసుకోవచ్చు. వయస్సు 24 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేలలోపు వేతనం ఉంటుంది.WAT (ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ): ఈ విభాగంలో 500 ఖాళీలు ఉన్నాయి. మూడేళ్ల డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2018-2021 మధ్య పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 24 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేలకు పైగా వేతనం ఉంటుంది.రిజిసర్ట్‌ చేసుకున్న అభ్యర్థులు ఈ ఈనెల 18న ఉదయం 10 గంటలకు జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులను హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులు అచ్యుతాపురం, వైజాగ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.

జాబ్‌మేళాకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్‌, స్టడీ సర్టిఫికేట్స్‌ జిరాక్స్‌లు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలను APSSDC డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌, కంచెర్ల పాలెం, విశాఖపట్నం 530007 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top