DRDO RAC Recruitment 2022: బీటెక్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. DRDO RAC లో 630 ఉద్యోగాలు.. ఇలా అప్లయ్‌ చేసుకోవాలి

DRDO RAC Scientist B Recruitment 2022: న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్డీవో రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (DRDO RAC) సైంటిస్ట్‌ బి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డీఆర్డీవో (డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌), డీఎస్టీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), ఏడీఏ (ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్‌ స్కోరు, రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ముఖాముఖి పరీక్షకు పిలుస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rac.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 630

డీఆర్డీవో-579

ఏడీఏ-43

డీఎస్టీ-8

ముఖ్య సమాచారం:

అర్హత: పోస్టును బట్టి స్పెషలైజేషన్‌తో కూడిన బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉండాలి. గేట్‌ పరీక్షలో తగిన స్కోరు లేదా ఐఐటీ - ఎన్‌ఐటీ పట్టభద్రులైతే 80 శాతం మార్కులు ఉండాలి. అర్హతలను బట్టి అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించారు. తాము ఏ కేటగిరీకి చెందుతారో అభ్యర్థులు చూసుకుని దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలున్న విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజినీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇతర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

వయో పరిమితి: 28 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్‌ స్కోరు, రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ముఖాముఖి పరీక్షకు పిలుస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: అప్లికేషన్‌ లింక్‌ ఓపెన్‌ అయిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

రాతపరీక్ష తేదీ: అక్టోబర్‌ 16, 2022

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rac.gov.in/

పరీక్ష విధానం:
రాత పరీక్షలో మొత్తం రెండు ప్రశ్నపత్రాలుంటాయి. ప్రతిదానికీ 300 మార్కులు. ఒక్కో పేపర్‌నూ 3 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌నే దీనికీ అమలు చేస్తున్నారు. పూర్తిగా వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఎంచుకున్న విభాగానికి సంబంధించి ప్రశ్నలు ఇస్తారు.అందువల్ల సంబంధిత సబ్జెక్ట్‌లో లోతైన అవగాహన తప్పనిసరి. ఐఈఎస్‌ పాతప్రశ్నపత్రాల అధ్యయనం ఉపయోగం. ఈ పరీక్ష తీరు అకడమిక్‌ పరీక్షలకు దగ్గరగా ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో చేతితో రాయడానికి తగిన సాధన అవసరం. ఇంటర్వ్యూకి 1:5 నిష్పత్తిలో పిలుస్తారు. తుది నియామకాల్లో రాతపరీక్షకు 80%, ఇంటర్వ్యూకి 20% వెయిటేజీ ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్‌ స్కోరు, రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ముఖాముఖి పరీక్షకు పిలుస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top