ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో భారీ జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు అధికారులు.ప్రముఖ Apollo Pharmacy సంస్థలో 100కు పైగా ఖాళీల (Jobs) భర్తీకి ఈ ఇంటర్వ్యూలను (Interviews) నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూలను ఈ నెల 11న అంటే ఎల్లుండి సోమవారం నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. మొత్తం 4 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
Trainer: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంది. M. Pharmacy విద్యార్హతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న వాళ్లు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా TA, ESI, PF, Bonusతో ఇతర సదుపాయాలు ఉంటాయి. ఎంపికైన వారు రాయలసీమ ప్రాంతంలో పని చేయాల్సి ఉంటుంది.
HR Recruiter: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంటుంది. MBA HR విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. ఎంపికైన వారికి TA&ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఎంపికైన వారు రాయలసీమలో పని చేయాల్సి ఉంటుంది.
Pharmacist: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉంటాయి. బీఫార్మసీ/ఎంఫార్మసీ/డీఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా రూ.3 వేల వరకు ఇన్సెంటీవ్స్ సైతం ఉన్నాయి. పులివెందులలో ఎంపికైన వారు పని చేయాల్సి ఉంటుంది.
Retail Trainee Associate: ఈ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు పులివెందులలో పని చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment