IDBI JOBS : ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో అసిస్టెంట్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఐడీబీఐ బ్యాంక్ బెంగుళూరులోని మణిపాల్, గ్రేటర్ నొయిడాలోని నిట్టే విద్యాసంస్ధలతో కలసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా లో ట్రెయినింగ్ ఇస్తారుకోర్సు పూర్తి చేసుకున్న వారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం అవకాశం కల్పిస్తారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1544 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో ఎగ్జిక్యూటివ్ లు 1044, అసిస్టెంట్ మేనేజర్లు 500 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, కంప్యూటర్ ఆపరేషన్స్ , లాంగ్వేజలో డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 నుండి 25 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 3, 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేది 17 జూన్ , 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.idbibank.in/ పరిశీలించగలరు.
0 comments:
Post a Comment