AP Tech Mahindra Jobs | Tech mahindra సంస్థలో ఖాళీల భర్తీకిప ప్రకటన

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి జాబ్ మేళా(Job Mela)లకు సంబంధించి ఇటీవల మళ్లీ వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి.,తాజాగా మరో ప్రకటనను సైతం విడుదల చేశారు అధికారులు. ప్రముఖ Tech mahindra సంస్థలో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు అధికారులు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. Customer Service Process-Kannada: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలు, పురుషులు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ మాట్లాడాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి 2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇంకా రూ.2 వేలను బ్రేక్ షిఫ్ట్ అలవెన్స్ చెల్లించనున్నారు. రూ.1000 ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.
2. Customer Service Process-Tamil: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తమిళం మాట్లాడగలగాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. రూ.2 వేలు బ్రేక్ షిఫ్ట్ అలవెన్స్ చెల్లించనున్నారు. రూ.1000 ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు.ఇతర వివరాలు:
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ https://apssdc.in/industryplacements/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 9 గంటలకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూలను రాఘవేంద్ర డిగ్రీ కాలేజీ, మంత్రాలయం, కర్నూల్ జిల్లా చిరునామాలో నిర్వహించనున్నారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7799494856 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top