జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయము, కడప
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, కడప జిల్లా వారి పరిధిలో నోటిఫికేషన్ నెం. 11 (F) SANITARY ATTENDER CUM WATCHMEN అవుట్ సోర్సింగ్ పద్దతిన భర్తీ చేయుటకు అర్హులైన OC (EWS) అభ్యర్తుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగములకు సంబందించిన దరఖాస్తు నమూనా మరియు ఇతర వివరములను www.kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు ఉంచడమైనది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తులతో పాటు నిర్దేశిత దరఖాస్తు రుసుము తో సంబంధిత సర్టిఫికేట్లను జతపరిచి 31-05-2022. నుండి 04-06-22 వ తేది సాయంత్రం 5 గం. లోపల తమ దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, కడప వారికి (లేదా) కార్యాలయములో ఏర్పాటు చేసిన అప్లికేషన్ డ్రాప్ బాక్స్ నందు వేయవలసినదిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను మరియు అసంపూర్ణ దరఖాస్తులను పరిగణన లోకి తీసుకొనబడవు
0 comments:
Post a Comment