Vijayanagaram District Anganwadi Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు (Vijayanagaram District) చెందిన స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం..అంగన్‌వాడీలు, అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల (Anganwadi Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 86
పోస్టుల వివరాలు:
అంగన్‌వాడీ పోస్టులు: 10
అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు: 73
మినీ అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు: 3
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సదరు గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లేదా షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: శిశు అభివృద్ధి పథకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం, ఏపీ.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 23, 2022.
Join Whatsapp Group: https://chat.whatsapp.com/CAo6bYR0DVUDDYthzJEZjm
0 comments:
Post a Comment