BSF Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బీఎస్‌ఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం గ్రూప్‌బి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ చేయనున్నారు.ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఇన్‌స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)-01, సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్) 57, జూనియర్ ఇంజనీర్/ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) 32 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా డిగ్రీ (అర్కిటెక్చర్), సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను శారీరక ప్రమాణాలు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ. 35000 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.
0 comments:
Post a Comment