TSPSC FAQs | తెలంగాణ జాబ్ నోటిఫికేషన్ విషయంలో సందేహాలు ఉన్నాయా... TSPSC సమాధానాలు ఇనే....

తెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను (Telangana Govt Jobs) భర్తీ చేయబోతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్స్ వస్తాయన్నారు.అయితే వీటిలో చాలావరకు నియామక ప్రక్రియను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చేపట్టనుంది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ ఎలా జరుగుతుంది? దరఖాస్తు చేసేప్పుడు అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వస్తాయి? అన్న అంశాలను దృష్టిలో తీసుకొని టీఎస్‌పీఎస్‌సీ పోర్టల్‌లో పలు సందేహాలు, ప్రశ్నలకు టీఎస్‌పీఎస్‌సీ సమాధానాలు ఇచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్ సెక్షన్‌లో ఈ సమాధానాలు ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌సీ FAQ లో ఉన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.
1. పోస్టుల వివరాలను కమిషన్ ఎప్పుడు తెలియజేస్తుంది?
ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్, ఇతర అవసరమైన అనుమతులు అందాలి. సంబంధిత అపాయింటింగ్ అథారిటీ/యూనిట్ ఆఫీసర్ ద్వారా ఉద్యోగ ఖాళీల వివరాలు కమిషన్‌కు చేరాలి. ఆ తర్వాతనే కమిషన్ పోస్టుల వివరాలను ప్రకటిస్తుంది.
2. ఉద్యోగ ఖాళీలను అభ్యర్థి ఎలా తెలుసుకోవాలి?
ప్రభుత్వం, యూనిట్ అధికారుల నుంచి పూర్తి వివరాలు, అనుమతులు అందిన తర్వాత.. సంబంధిత వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను కమిషన్‌ ఉంచుతుంది. అదే విధంగా రోజువారీ వార్తాపత్రికలలో ప్రకటనలు ఇస్తుంది.
3. పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అభ్యర్థులు పోస్టుకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించాలి.
4. TSPSC విడుదల చేసిన పోస్టులకు కనీస ప్రాథమిక అర్హత ఏంటి?
అర్హత, ఇతర అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్‌లో పేర్కొంటారు.
5. ఇతర రాష్ట్రాల్లో చదివిన అభ్యర్థి కూడా TSPSC జారీ చేసిన పోస్టులకు దరఖాస్తు చేయవచ్చా?
ఇతర రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే వారిని ఓపెన్ కాంపిటీషన్ కింద OCగా పరిగణిస్తారు.
6. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కమ్యూనిటీ రిజర్వేషన్ వర్తిస్తుందా?
ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఎటువంటి రిజర్వేషన్ లేదు. వారు OC కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
7. ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు ఏవైనా పత్రాలు జోడించాల్సిన అవసరం ఉందా?
ఆన్‌లైన్‌లో ఎలాంటి పత్రాలను జతచేయాల్సిన అవసరం లేదు. అయితే ధ్రువీకరణ సమయంలో కమిషన్ ముందు అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
8. సాధారణ, పరిమిత రిక్రూట్‌మెంట్ మధ్య తేడా ఏంటి?
అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్‌లు ఓసీ, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌, మహిళలకు చెందిన అభ్యర్థులకు వర్తిస్తాయి. వీటిని సాధారణ రిక్రూట్‌మెంట్‌గా పేర్కొంటారు. పరిమిత నియామకాలలో ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వ్డ్ కేటగిరీలకు సంబంధించి ఇంతకముందు జరిగిన రిక్రూట్‌మెంట్‌లలో మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తారు.
9. క్రీమీ లేయర్ అంటే ఏంటి?
సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని క్రీమీ లేయర్‌గా పేర్కొంటారు. సివిల్ పోస్టులు, సేవలలో రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి సామాజికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులను మినహాయించటానికి రూ.6.00 లక్షల వార్షిక ఆదాయం మించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
10. క్రీమీ లేయర్ సర్టిఫికెట్లను ఎవరు జారీ చేస్తారు?
మండల రెవెన్యూ అధికారి/తహసీల్దారుకు ప్రొఫార్మాలో క్రీమీ లేయర్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఉంటుంది.
11. నేను కర్ణాటకలో ఉంటున్నాను, నేను ఇక్కడి నుంచి దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చా?
అవును, మీరు భారతదేశంలో ఎక్కడి ననుంచి అయినా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.
12. నేను తెలంగాణలో చదువుకున్నాను, కానీ ఇప్పుడు USAలో పని చేస్తున్నాను, గ్రూప్-Iకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందా?
అవును, మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
13. TSPSC జారీ చేసిన నోటిఫికేషన్‌లు, ప్రెస్ రిలీజ్‌లు, టైమ్‌టేబుల్స్ ఎక్కడ లభిస్తాయి?
TSPSC జారీ చేసిన అన్ని ప్రెస్ రిలీజ్‌లు, నోటిఫికేషన్‌లు TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
14. దరఖాస్తుదారుడి వయస్సును ఏ తేదీ ఆధారంగా లెక్కిస్తారు?
నిర్దిష్ట పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందేందుకు దరఖాస్తుదారుడి వయస్సును లెక్కించే రోజు ఆ పోస్ట్ కోసం కమిషన్ నోటిఫికేషన్‌ను ప్రచురించిన సంవత్సరంలోని జులై 1వ తేదీ. ఈ తేదీ నాటికి ఉన్న తక్కువ వయస్సు/అధిక వయస్సు బట్టి అభ్యర్థి అనర్హులవుతారు.
15. పోస్టుకు దరఖాస్తు చేయడానికి పాటించాల్సిన నిబంధనలు ఏంటి?
ఒక నిర్దిష్ట పోస్ట్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తి సంబంధిత నోటిఫికేషన్ , ఇతర సాధారణ షరతుల కింద పేర్కొన్న ప్రమాణాలను పాటించాలి.
16. TSPSC రిక్రూట్‌మెంట్‌లో SC, ST, BCలకు ఎంత రిజర్వేషన్లు కల్పించారు?
BC(A)కి 07శాతం, BC(B)కి 10 శాతం, BC(C)కి 01శాతం, BC(D)కి 07 శాతం, BC(E)కి 04%శాతం, STకి 06% శాతం, Scలకు 15 శాతం రిజర్వేషన్‌ కేటాయించారు.
17. రిక్రూట్‌మెంట్‌లో కమ్యూనిటీ వారీగా అర్హత మార్కులు ఏంటి?
OCలకు 40 శాతం, BCలకు 35, SC, STలకు 30 శాతం మార్కులు కనీస అర్హతగా పేర్కొన్నారు. కమిషన్‌ నిర్దేశించిన విధంగా పోస్టుల సంఖ్య, ఇంటర్వ్యూకు పిలిచే వ్యక్తుల సంఖ్యని బట్టి కనీస అర్హత మార్కులను లెక్కిస్తారు.
18. TSPSC పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి గరిష్ఠ వయస్సు ఎంత?
TSPSC ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులు.
19. వివిధ రిజర్వుడ్ కేటగిరీలకు సూచించిన వయస్సు సడలింపు ఎంత?
వికలాంగులకు 10 సంవత్సరాలు, ఎస్‌సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు ఆధారంగా గరిష్టంగా 5 ఏళ్లు సడలింపు ఉంది. అయితే గరిష్ట వయస్సు పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితి పెరుగుతోంది.
20. TSPSC జారీ చేయబోయే నోటిఫికేషన్లలో మహిళా అభ్యర్థులకు ఏదైనా రిజర్వేషన్ వర్తిస్తుందా?
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం మహిళా అభ్యర్థులకు 33 1/3 శాతం రిజర్వేషన్ 1996 మే 28వ తేదీ నుంచి అమల్లో ఉంది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ క్వశ్చన్స్‌తో పాటు వాటి సమాధానాలను https://www.tspsc.gov.in/FAQ.jsp వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలు, విభాగాల్లో ఉన్న 80,039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top