Jobs : భారత ప్రభుత్వ రంగ సంస్ధ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందిఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి జూనియర్ ఇంజనీర్లు 80 ఖాళీలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ 1, ఖాళీ ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానం ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదిగా ఏప్రిల్ 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.nbccindia.com సంప్రదించగలరు.
0 comments:
Post a Comment