రాష్ట్రంలో 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీ లను జిల్లా యూనిట్గా భర్తీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. మండల, పట్టణ యూనిట్ వాలంటీర్లను ఇది వరకు నియమించారు. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్గా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. వాలంటీర్ల ఖాళీల భర్తీకి నెలలో రెండుసార్లు సంయుక్త కలెక్టర్లు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఖాళీల వివరాలను ప్రతి నెలా 1, 16 తేదీల్లో మండల పరిషత్ అభివృద్ధికారులు (ఎంపీ డీవో), పుర కమిషనర్లు సంయుక్త కలెక్టర్లకు తెలపాలి. సరైన కారణం లేకుండా వరుసగా 3 రోజులపాటు విధులకు గైర్హాజరయ్యే వాలంటీర్లను తొలగిస్తారు. ఏడో రోజున వాలంటీర్ స్థానం ఖాళీ అయినట్లుగా అధికారులు.నోటిఫై చేయాలని సంయుక్త కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో సచివాలయాల శాఖ పేర్కొంది.
0 comments:
Post a Comment