చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్.. ఇండియన్ బ్యాంక్ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీల సంఖ్య: 202
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.14,500ల నుంచి రూ.28,145ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ అయ్యి ఉండాలి.
అర్హతలు:
-అభ్యర్థులు SSC/మెట్రికులేషన్ విద్యార్హతను గుర్తింపు పొందిన బోర్డ్ ను పొంది ఉండాలి.
-అభ్యర్థులు తప్పనిసరిగా ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి.
-సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి.
-వయస్సు 26 ఏళ్లు ఉండాలి.
ఎంపిక ఇలా..
1.ఆబ్జెక్టివ్ టైప్ టెస్త్-ఆన్లైన్
2.లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
3.ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
4.కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఎలా అప్లై చేసుకోవాలంటే..
అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ indianbank.in ను ఓపెన్ చేయాలి.
అనంతరం Career విభాగంలో Recruitment of Security Guards in Subordinate Staff Cadre - 2022 సెక్షన్ లో Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Click here for New Registration ఆప్షన్ ను ఎంచుకుని పేరు, కాంటాక్ట్ వివరాలు, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
అనంతరం అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి ప్రింట్ తీసుకోవాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష, లోకల్ ల్యాంగ్వేజ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 40 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. 90 నిముషాల పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 9, 2022.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
https://chat.whatsapp.com/CgJUTKK2qoDDyg97Nc5Zr0
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.....
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.indianbank.in/
0 comments:
Post a Comment