హెచ్‌సీఎల్ టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్
ఇంటర్ పూర్తయిందా..?
సాఫ్ట్‌వేర్ కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారా?
చదువుకునే స్తోమత లేదా?
అయితే ఈ వివరాలు చూడండి.. ఉద్యోగానికి కావల్సిన శిక్షణతోపాటు స్టయిఫండ్ ఇస్తారు. ఉన్నత చదువులను చదువుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం ప్రముఖ ఐటీ కంపెనీ
హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాన్ని ఇస్తారు. వీటన్నింటి సమాహారమే హెచ్‌ఎస్‌ఎల్ టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్. ఇంటర్ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులైనవారు అర్హులు. హెచ్‌సీఎల్
నిర్వహించే రాతపరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిస్తే చాలు ఈ ప్రోగ్రామ్ విశేషాలు మీ కోసం..
టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్
ఈ ప్రోగ్రామ్‌ను హెచ్‌సీఎల్ టెక్ బీ 2016లో ప్రారంభించింది. ఉద్యోగానికి అవసరమయ్యే శిక్షణను ఇచ్చి తమ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా ఉద్యోగాన్నిస్తుంది. దీనికోసం హెచ్‌సీఎల్ ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుంటే హెచ్‌సీఎల్‌లో ప్రారంభ స్థాయి ఐటీ ఇంజినీర్‌గా ఉద్యోగం ఇస్తారు. 2016 నుంచి ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ పొంది హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్నారు.
ఉద్యోగం చేస్తూనే ప్రసిద్ధ సంస్థల నుంచి డిగ్రీ కోర్సులనూ చదువుకునే అవకాశం కల్పిస్తారు.
ఎర్న్ అండ్ లెర్న్
ఎంపికైన వారికి 6 నెలల నుంచి 12 నెలలు శిక్షణ ఇస్తారు. వీరికి కింది అంశాలను నేర్పిస్తారు. అవి..
మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ నేర్చుకుంటారు. ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్, అసైన్‌మెంట్లు, కేస్ బేస్డ్ సబ్‌మిషన్స్.
శిక్షణ సమయంలో నెలకు రూ.10 వేలు స్టయిఫండ్ ఇస్తారు.
హైదరాబాద్, విజయవాడ, నోయిడా, లక్నో, మధురై, చెన్నై, నాగ్‌పూర్, బెంగళూరుల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.
శిక్షణ తర్వాత ?
శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని అదే కంపెనీలో ఫుల్‌టైమ్ ఐటీ ఇంజినీర్‌గా తీసుకుంటారు.
ఉద్యోగ విధులు ఇవే
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను వీరికి ఇస్తారు.
ఐటీ సర్వీసెస్, అసోసియేట్ విధుల్లో తీసుకుంటారు.
విధుల్లో భాగంగా వీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్, డిజైన్ ఇంజినీర్, టెక్ అనలిస్ట్, డాటా ఇంజినీర్, సపోర్ట్ అండ్ ప్రాసెస్ అసోసియేట్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ఏడాదికి రూ.1.70 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు వేతనం ఇస్తారు. అంటే నెలకు రూ.16,600 నుంచి రూ.18,000 వరకు జీతం వస్తుంది.
నోట్: శిక్షణకు ఎంపికైనవారు ఐటీ సర్వీస్ ప్రోగ్రామ్, అసోసియేట్ ప్రోగ్రామ్‌లకు రూ.లక్ష + పన్నులు చెల్లించాలి. ఈ ఫీజులను కట్టలేని వారికి ఈ మొత్తానికి బ్యాంకు ద్వారా రుణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. శిక్షణలో ప్రతిభ చూపినవారు చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే వందశాతం ఫీజు, 85 నుంచి 90 శాతం స్కోర్ వచ్చినవారికి 50 శాతం ఫీజు వెనక్కి ఇస్తారు.
ఎవరు అర్హులు?
మ్యాథ్స్/బిజినెస్ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణత. 2020, 2021లో ఉత్తీర్ణులైనవారు, 2022లో పరీక్షలు రాయనున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ఐటీ సర్వీసెస్ ప్రోగ్రామ్‌కు కనీసం 85 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసోసియేట్ ప్రోగ్రామ్‌కు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్‌ఈ విద్యార్థులకు అయితే 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత అవసరం.
హెచ్‌సీఎల్ క్యాట్
ఎంపిక కోసం హెచ్‌సీఎల్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (క్యాట్) నిర్వహిస్తుంది.
దీనిలో క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ హెచ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ టీం నిర్వహిస్తుంది.
ఉన్నత విద్య
శిక్షణలో చేరిన విద్యార్థులు ఎలాంటి ఆటంకం లేకుండా డిగ్రీ చదువుకోవచ్చు. తంజావూర్‌లోని శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, అమిటీ యూనివర్సిటీ అందించే గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించవచ్చు.
Sir/madam.I complete intermediate with 571 marks.And I completed "C" Language computer course.
ReplyDeleteSo,any one like my qualifications plz call to me: 9121961132