భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నోయిడాలోని సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సి-డాక్)…వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు 11, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 14, ప్రాజెక్ట్ లీడ్ పోస్టులు 15, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 193, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు 28 ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్ డిజైన్ అండ్ డెవల్‌పమెంట్, సొల్యుషన్ ఆర్కిటెక్ట్, యూఐ, యూఎక్స్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ,బీటెక్, ఎంసీఏ,తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి డిసెంబరు 22వ తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.cdac.in/index.aspx?id=ca_noida_recruit_nov21 సంప్రదించగలరు
0 comments:
Post a Comment