Railway Jobs: భారీగా పెరిగిన రైల్వే టెక్నీషియన్ పోస్టులు.. 14,298 ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన

RRB Technician Recruitment 2024 : రైల్వే ఉద్యోగాలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. రైల్వే ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి సన్నద్ధమవుతున్న వాళ్లు లేకపోలేదు. ఈ క్రమంలో.. ఉద్యోగార్థులకు రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివరాల్లోకెళ్తే.. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ కొలువులకు గత మార్చి నెలలో ఆర్‌ఆర్‌బీ (Railway Recruitment Board) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 9,144 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అయితే.. తాజాగా ఈ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
తాజా రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ ప్రకారం దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. మన సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా ముంబయి రైల్వే జోన్‌లో 1,883 ఖాళీలుండగా.. అత్యల్పంగా సిలిగురి రైల్వే జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి నోటీసుల కోసం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని కోరింది.

అయితే.. ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్‌/ నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో ఈ తేదీలపై కూడా అధికారికంగా స్పష్టత రానుంది

రాత పరీక్ష విధానం :

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్‌ అవేర్‌నెస్‌ (10 ప్రశ్నలు, 10 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (15 ప్రశ్నలు, 15 మార్కులు), బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ (20 ప్రశ్నలు, 20 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (35 ప్రశ్నలు, 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ఇక.. టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్‌ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్‌ సైన్స్‌ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు మొత్తం 100 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది.

టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్‌ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు, 25 మార్కులు), జనరల్‌ సైన్స్‌ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌ (10 ప్రశ్నలు, 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు మొత్తం 100 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది.

పోస్టులు వివరాలు:

1. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ (ఓపెన్ లైన్): 1,092 పోస్టులు

2. టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్ లైన్): 8,052 పోస్టులు

3. టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్షాప్ అండ్ పీయూఎస్): 5,154 పోస్టులు

: 14,298. (-6171, 2- 2014, 2- 1152, 2໖໖- 3469, ఈడబ్ల్యూఎస్- 1481)

ఆర్ఆర్ బీ రీజియన్ వారీగా ఖాళీలు:

1. ఆర్ఆర్బీ అహ్మదాబాద్- 1015

2. ఆర్ఆర్బీ అజ్మేర్- 900

3. ఆర్ఆర్బీ బెంగళూరు- 337

4. ఆర్ఆర్బీ భోపాల్- 534

5. ఆర్ఆర్బీ భువనేశ్వర్- 166

6. ఆర్ఆర్బి బిలాస్పూర్ - 933

7. ఆర్ఆర్బీ చండీగఢ్- 187

8. ໑໙໖ - 2716

9. ఆర్ఆర్బి గువాహటి- 764

10. ఆర్ఆర్బీ జమ్ము అండ్ శ్రీనగర్- 721

11. ఆర్ఆర్బీ కోల్కతా- 1098

12. ఆర్ఆర్బీ మాల్టా- 275

13. ఆర్ఆర్బీ ముంబయి- 1883

14. ఆర్ఆర్బీ ముజఫర్పూర్- 113

15. ఆర్ఆర్బీ పట్నా- 221

16. ఆర్ఆర్బీ ప్రయాగ్జ్- 338

17. ໙໙໖ - 350

18. ఆర్ఆర్బి సికింద్రాబాద్- 959

19. ఆర్ఆర్బీ సిలిగురి- 91

20. ఆర్ఆర్బీ తిరువనంతపురం- 278

21. ఆర్ఆర్బీ గోరఖ్పూర్ - 419

ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్
పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02-10-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-10-2024.

Download Complete Notification


Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top