Indian Navy Recruitment: ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు..ఇండియన్ నేవీలో ఉద్యోగాల

Indian Navy Sailor Recruitment 2024: ఇండియన్ నేవీలో సెయిలర్ రిక్రూట్ మెంట్ 2024కు రిజిస్ట్రేషన్ షురూ అయ్యింది. ఆసక్తి, ఆర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ joinindiannavy.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమై 2024 సెప్టెంబర్ 17వ తేదీన ముగుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ నవంబర్ 2024 బ్యాచులో ఎస్ఎస్ఆర్ కోసం మెడికల్ బ్రాంచ్ లో అభ్యర్థులను భర్తీ చేస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలు తెలుసుకుందాం.

అర్హత:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ నుంచి గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తోపాటు 10+2పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు నవంబర్ 1 , 2023 నుంచి ఏప్రిల్ 30,2007 మధ్య జన్మించి ఉండాలి. 

ఎంపిక:

ఎస్ఎస్ఆర్, మెడ్ అసిస్టెంట్ బ్యాచ్ ఎంపిక ప్రక్రియలో రెండు స్టేజుల్లో జరుగుతుంది. స్టేజ్ 1 లో 10+2 లో
సంపాదించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. స్టేజ్ 2లో పీఎఫ్టీ, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ లో సాధించిన మార్కుల ఆధారంగా అర్హులను నిర్థారిస్తారు. అభ్యర్థులను రాష్ట్రాల వారీగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు అభ్యర్థులు రూ. 60 తోపాటు జీఎస్టీ చెల్లించాలి. ఆన్ లైన్ విధానంలో మాత్రమే చెల్లింపుల చేయాల్సి ఉంటుంది. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్ సైట్ joinindiannavy.gov.in కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ నేవీ అధికారిక పేజీలోకి వెళ్లి హోం పేజీలో ఉన్న అప్లై ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేసి క్లిక్ చేయలి. తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఈ కోర్సుకు సంబంధించిన ప్రాథమిక శిక్షణ 2024 నవంబర్ లో ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభం అవుతుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు.

Download Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top