SSC GD Constable Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) కోసం సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 27న జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సన్నద్ధమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం ఆగస్టు 27వ తేదీన ఈ SSC GD 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీతో పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. గతేడాది 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉండే అవకాశం ఉంది. సుమారు 40 వేల నుంచి 50 వేల మధ్యలో ఖాళీలు ఉండే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment