Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : ఢిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited).. రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆర్‌వీఎన్‌ఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://rvnl.org/job వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య : 24
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు - 06
సీనియర్ మేనేజర్ పోస్టులు - 06
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - 02
సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - 10
ఇతర ముఖ్యమైన సమాచారం :
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీకామ్, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డీజీఎం పోస్టులకు 45 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు, మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా, ఆర్కే పురం, న్యూ దిల్లీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2024
0 comments:
Post a Comment