ITBP Recruitment 2024: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 143 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య- 143
అర్హత: కానిస్టేబుల్ ట్రెడ్స్‌మెన్ పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వృత్తిలో పని అనుభవం కలిగి ఉండాలి. కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులకు పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100.
వయో పరిమితి: కానిస్టేబుల్ పోస్టులకు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ఒరిజినల్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 28. 07. 2024.
దరఖాస్తు చివరి తేదీ: 26.08.2024.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వీడియో క్రింది లింకు ద్వారా వీక్షించండి
0 comments:
Post a Comment