HCL Tech Bee 2024 : ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ (HCL) ఇంటర్ విద్యార్థులకు సువర్ణావకాశం కల్పించనుంది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ HCL సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్‌బీ (HCL TechBee) పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ప్రకటనలో తెలిపింది. ఇక.. ఆసక్తిగల విద్యార్థులు అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఇంటర్ విద్యార్హతతో ఐటీ రంగంలో ఉపాధి కల్పించే హెచ్‌సీఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ కోర్సుల్లో ఎంపికలు చేపడుతున్న ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఈఓ సుర్జీత్ సింగ్ ప్రకటించారు. ఇంటర్ తర్వాత ఐటి రంగంలో విద్య, ఉపాధి అవకాశాలను టెక్‌బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు అందిస్తారు. హెచ్‌సీఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ కోర్సులతో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా ప్రత్యేకమైన డ్రైవ్‌లలో విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ ఒకేషనల్, సీఇసీ, హెచ్ఈసీ, బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులుగా ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ విద్యను ఒక ఏడాది పాటు అందచేస్తారు. ఎంపికైన విద్యార్థులకు భారత దేశంలో పేరొందిన ఐటి కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ కంపెనీ డిజిటల్ విద్యను అందించి ఉపాధి కల్పిస్తారు. ఉపాధి పొందుతూనే విద్యార్థులు ఉన్నత విద్యను కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తారు. ఏడాది కాలం పాటు టెక్ బీ ప్రోగ్రామ్‌కు ఎంపిక అయిన అభ్యర్థులు శిక్షణ అనంతరం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధి పొందడానికి అర్హులుగా గుర్తిస్తారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట హెచ్‌సిఈఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రక్రియల్లో విజయం సాధించిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ నియామక పత్రాలు అందజేస్తారు.
ప్రోగామ్‌కు ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది. తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. స్టైపెండ్ కింద నెలకు రూ.10 వేలు ఇస్తారు. 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఉద్యోగం సాధించిన తర్వాత ఏటా రూ. 1.7 లక్షలు నుంచి రూ. 2.2 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఐటీ, సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ విభాగాల్లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్లు పోస్టులు ఉన్నాయి. ఇతర వివరాలకు 9642973350, 7780323850, 7780754278, 6363095030 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే.. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, ట్రిపుల్‌ఐటీ కొట్టాయమ్, సస్త్రా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలను https://www.hcltechbee.com/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీలో జిల్లాల వారీగా ఎంపికల షెడ్యూల్ ఇదే :
కృష్ణా- ఆగష్టు 6, నెల్లూరు- ఆగష్టు 8, గుంటూరు, ప్రకాశం, చిత్తూరులో- ఆగష్టు 9, కడప- ఆగష్టు 10, కర్నూలు- ఆగష్టు 13, అనంతపురం- ఆగష్టు 17, పశ్చిమ గోదావరి- ఆగష్టు 19, తూర్పు గోదావరి- ఆగష్టు 20, విశాఖ- ఆగష్టు 22, విజయనగరం- ఆగష్టు 23, శ్రీకాకుళం- ఆగష్టు 24 తేదీల్లో ఈఐటీ కోర్సుల్లో ఎంపికకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు.
0 comments:
Post a Comment