AI AIRPORT SERVICES LIMITED | Customer Service Excutive Posts Recruitment Notification

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ సంస్థ ‘కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్’ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు AIASL అధికారిక వెబ్‌సైట్ aiasl.in విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు తుది గడువు జులై 14న ముగుస్తుంది.

ఖాళీల వివరాలు

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 1049 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 343 పోస్టులు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ 706 పోస్టులు ఉన్నాయి

అర్హత ప్రమాణాలు

పోస్ట్ ఆధారంగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఛార్జీలు, రిజర్వేషన్స్, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ చెక్-ఇన్, టికెటింగ్, కార్గో హ్యాండ్లింగ్‌ వంటి విభాగాల్లో కనీసం ఐదు సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అభ్యర్థి ఎక్స్‌‌ఫర్ట్ PC యూజర్ అయి ఉండాలి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ లాంగ్వేజ్‌పై మంచి పట్టు ఉండాలి.

వయోపరిమితి

జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయసు 33 ఏళ్ల మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా AIASL అధికారిక పోర్టల్www.aiasl.in ఓపెన్ చేయాలి.

- హోమ్ పేజీలోకి వెళ్లి, ‘రిక్రూట్‌మెంట్’ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి.

- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్’ అనే రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.

- ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి
అన్ని వివరాలతో అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. చివరగా ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. అందుకు సంబంధించిన డీడీ వివరాలను అప్లికేషన్ ఫారమ్‌లో పొందుపర్చాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

సెలక్షన్ ఎలా?

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొన్ని దశలు ఉంటాయి. ముందు రాత పరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూ, ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అన్ని దశలను క్లియర్ చేసినవారికి పోస్టింగ్ ఉంటుంది.

జీతభత్యాలు

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు ఎంపికైన వారికి నెల జీతం రూ.27,450 కాగా సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు రూ.28,605 లభిస్తుంది. ఎంపికయ్యే అభ్యర్థులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫిక్స్‌డ్- టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన (మూడు సంవత్సరాలు) పని చేయాల్సి ఉంటుంది

Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top