Tomorrow job Mela: మెగా జాబ్‌మేళా

మండలంలోని కేసరపల్లి శివారు వీకేఆర్‌ కళాశాలలో ఈ నెల 20వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు వెంకట్‌ మోటపర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్‌మేళాలో సుంగ్‌వూ హైటెక్‌, హ్యుందాయ్‌, మోబిస్‌, యాక్ట్‌, ఆల్‌స్టోమ్‌, డైకిన్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, డిక్‌, డిక్సన్‌, ఫాక్స్‌కాన్‌, హెడీబీ ఫైనాన్షియల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నీట్‌, ఇన్‌పిలూమ్‌ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ పూర్తిచేసిన 18 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు, మహిళలు ఈ జాబ్‌మేళాకు అర్హులుగా తెలిపారు.

ఈ జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని పరిసరా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top