హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా 247 పోస్టుల భర్తీ చేయనున్నారు.
వీటిలో ఇంజనీరింగ్, సీనియర్ ఆఫీసర్‌తో పాటు పలు పోస్టులు ఉన్నాయి. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియంలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకాగా, జూన్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్న ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఇంజనీరింగ్ (158), సీనియర్ ఆఫీసర్ (10), అసిస్టెంట్ మేనేజర్/సీనియర్ ఆఫీసర (12), సీనియర్ మేనేజర్ (2), మేనేజర్ టెక్నికల్ (2), మేనేజర్ సేల్స్ ఆర్ అండ్ డీ ప్రొడక్ట్ (2), డప్యూటీ జనరల్ మేనేజర్ (1), చార్టెడ్ అకౌంటెంట్స్ (29), క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ (9), ఐఎస్ ఆఫీసర్ (15), ఐఎస్ సెక్యూరిటీ ఆఫీసర్ (1), క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (6) ఖాళీలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ పోస్టులకు ఎంపికైన వారికి గరిష్టంగా రూ. 1.6 లక్షల వరకు జీతం పొందొచ్చు. ఇక సీనియర్ మేనేజర్ పోస్టులకైతే ఏకంగా రూ.2.4 లక్షల వరకు జీతం అందించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 25 నుంచి 32 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక విద్యార్హతల విషయానికొస్తే పోస్టుల ఆధారంగా అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి ఉండాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
* ఇందుకోసం ముందుగా హెచ్‌పీసీల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

అనంతరం కెరీర్స్ విభాగంలోకి వెళ్లి, కరెంట్ జాబ్ ఓపెనింగ్స్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ 2024-25 ఆప్షన్‌లోకి వెళలి ‘క్లిక్ హియర్ టు అప్లై’ పై నొక్కాలి.
* మీ సంబంధిత వివరాలతో రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది.
0 comments:
Post a Comment