SSC MTS 2024 : 10వ తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

SSC MTS Recruitment 2024 : కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) సిద్ధమవుతోంది. ఎస్‌ఎస్‌సీ 2024-25 ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 27వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. జులై 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. అక్టోబర్‌- నవంబర్‌ నెలలో రాత పరీక్షలు నిర్వహించనుంది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్‌-సీ నాన్‌ గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌), హవల్దార్ (గ్రూప్‌-సీ నాన్‌-గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీకానున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,558 ఖాళీలు భర్తీ అయిన విషయం తెలిసిందే. ఎంటీఎస్‌ ఖాళీలను సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top