Bank of Baroda Recruitment 2024 : గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ప్రధాన కార్యాలయం భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో వివిధ విభాగాల్లో 459 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్‌ఎంఈ, జోనల్ సేల్స్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, సీనియర్ డెవలపర్ తదితర పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 2వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం :
మొత్తం పోస్టుల సంఖ్య: 459
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 2, 2024
0 comments:
Post a Comment