RRB ALP Recruitment 2024: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 19న అధికారిక ప్రకటన విడుల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం.. 5,696గా ఉన్న ఏఎల్‌పీ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల (Preferences) నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని 30 నుంచి 33కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్టుల సంఖ్యను భారీగా పెంచింది. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి మొదట 5,696 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20 నుంచి ఫిభ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. తాజా పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య 585 నుంచి 1949కి పెరిగింది. సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే పోస్టుల సంఖ్య 1192 నుంచి 3973 కి పెరిగింది. ఇక సౌత్ ఈస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య 300 నుంచి 1001కి పెరిగింది. ఇక సదరన్ రైల్వే పోస్టుల సంఖ్య 218 నుంచి 726కి పెరిగింది. సౌత్ వెస్టర్న్ రైల్వే పోస్టుల సంఖ్య 473 నుంచి 1576కి పెరిగింది.
పోస్టుల వివరాలు ఇలా...
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సీబీటీ-1 పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ సీబీటీ-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు నెలలో సీబీటీ-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ నవంబరులో ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) పరీక్ష నిర్వహించనున్నారు.
➥ ఆప్టిట్యూట్ టెస్ట్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
➥ అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు సంబంధించి వచ్చే ఏడాదికి సంబంధించిన 'సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్'ను 2025 జనవరిలో విడుదల చేస్తారు.
0 comments:
Post a Comment