Balmer Lawrie Recruitment: కోల్‌కతాలోని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 33
1. జూనియర్ ఆఫీసర్(ఆపరేషన్స్): 01
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: లాజిస్టిక్స్ సర్వీసెస్ (హైదరాబాద్).
2. జూనియర్ ఆఫీసర్(ఎలక్ట్రికల్): 01
అర్హత: ఎలక్ట్రికల్‌లో డిప్లొమా(అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్), ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ లైసెన్స్ లేదా కాంపిటెన్సీ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ (అసోటి).
3. జూనియర్ ఆఫీసర్(ఎస్‌సీఎం): 03
అర్హత: గ్రాడ్యుయేట్(కామర్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ (ముంబై, బరోడా, సిల్వాస్సా).
4. జూనియర్ ఆఫీసర్(ప్రొడక్షన్): 06
అర్హత: మెకానికల్‌లో డిప్లొమా(అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ (సిల్వాస్సా, బరోడా, అసోతి, తలోజా).
5. జూనియర్ ఆఫీసర్(క్వాలిటీ అస్యూరెన్స్): 02
అర్హత: గ్రాడ్యుయేట్(కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (కోల్కతా అండ్ చెన్నై).
6. జూనియర్ ఆఫీసర్(ప్రొడక్షన్): 01
అర్హత: మెకానికల్ లేదా కెమికల్‌లో డిప్లొమా(అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (చెన్నై).
7. జూనియర్ ఆఫీసర్(ఆపరేషన్స్): 01
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (విశాఖపట్నం).
8. జూనియర్ ఆఫీసర్ (PDC మరియు పైలట్ ప్లాంట్): 01
అర్హత: కెమికల్ లేదా పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా (అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: కెమికల్స్ (చెన్నై).
9. అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్): 01
అర్హత: డిప్లొమా(అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్) ( టెక్స్‌టైల్ టెక్నాలజీ లేదా టెక్స్‌టైల్ కెమికల్స్) లేదా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (టెక్స్‌టైల్ టెక్నాలజీ లేదా టెక్స్‌టైల్ కెమికల్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: కెమికల్స్ (తిరుప్పుర్).
10. అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్): 01
అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌లో ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: లాజిస్టిక్స్ సర్వీసెస్ (ముంబై).
11. అసిస్టెంట్ మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్): 01
అర్హత: స్పెషలైజేషన్(కెమికల్ లేదా పెట్రోలియం లేదా పెట్రోకెమికల్ లేదా ఆయిల్ టెక్నాలజీ)తో ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంఎస్సీ (కెమిస్ట్రీ లేదా పెట్రోలియం లేదా పెట్రోకెమికల్ లేదా పాలిమర్ కెమిస్ట్రీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (చెన్నై).
12. డిప్యూటీ మేనేజర్ (రిటైల్ సేల్స్): 01
అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌లో ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (లక్నో).
13. డిప్యూటీ మేనేజర్ (బ్రాండ్): 01
అర్హత: 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా మీడియా సైన్స్ లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా మల్టీమీడియా లేదా డిజిటల్ మార్కెటింగ్ లేదా మీడియా స్టడీస్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (కోల్‌కతా).
14. సీనియర్ మేనేజర్ (బ్రాండ్): 01
అర్హత: 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా మీడియా సైన్స్ లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా మల్టీమీడియా లేదా డిజిటల్ మార్కెటింగ్ లేదా మీడియా స్టడీస్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (కోల్‌కతా).
15. మేనేజర్ (ఆపరేషన్స్): 01
అర్హత: స్పెషలైజేషన్ (సివిల్)తో ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 37 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ (కోల్‌కతా).
16. అసిస్టెంట్ మేనేజర్ (ఎఫ్‌ఐసీఓ ఫంక్షనల్): 01
అర్హత: ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్) లేదా సీఏ లేదా ఎంసీఏ లేదా 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: కార్పొరేట్ ఐటీ (కోల్‌కతా).
17. అసిస్టెంట్ మేనేజర్ (ఎస్‌ఏపీ ఏబీఏపీ): 01
అర్హత: ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ లేదా తత్సమానం) లేదా ఎంసీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: కార్పొరేట్ ఐటీ (కోల్‌కతా).
18. యూనిట్ హెడ్ (కోల్డ్ చైన్) రాయ్): 01
అర్హత: ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఏదైనా స్పెషలైజేషన్) లేదా 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: కోల్డ్ చైన్ (రాయ్).
19. జూనియర్ ఆఫీసర్ (హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్): 01
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: హ్యూమన్ రిసోర్స్ (ముంబై).
20. డిప్యూటీ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్): 02
అర్హత: ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఏదైనా స్పెషలైజేషన్) లేదా 2 సంవత్సరాల ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: కోల్డ్ చైన్ (పాతాళగంగ మరియు రాయ్).
21. అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్): 02
అర్హత: సీఏ లేదా ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ (చెన్నై అండ్ ముంబై).
22. డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్): 01
అర్హత: సీఏ లేదా ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: గ్రేసెస్ అండ్ లూబ్రికంట్స్ (చెన్నై).
23. వైస్ ప్రెసిడెంట్ (ప్రాజెక్ట్స్): 01
అర్హత: ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (ఏదైనా స్పెషలైజేషన్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 48 సంవత్సరాలు మించకూడదు.
పోస్టింగ్ స్థలం: అసోసియేట్ సర్వీసెస్ (చెన్నై).
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు,ఈఎస్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష తదితరాల ఆధారంగా.
జీతం: జూనియర్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.21,750- రూ.65,000. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.40000 -140000. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.50000 - 160000. సీనియర్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.70000 -200000. మేనేజర్ పోస్టులకు నెలకు రూ.60000 - 180000. యూనిట్ హెడ్ పోస్టులకు నెలకు రూ.50000 -160000. వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు నెలకు రూ.100000 - 260000.
దరఖాస్తుకు చివరి తేదీ: 05.07.2024.
0 comments:
Post a Comment