బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవారి శుభావార్త. గోదావరి కృష్ణా కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బ్యాంక్ అధికారలు ఈ మేరకు ప్రకటన జారీచేశారు
.బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంబ్ బ్రాంచ్ మేనేజర్,గోల్డ్ లోన్ ఆఫీసర్‌తో పాటు మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, వేతనం, ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!
గోదావరి కృష్ణా కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-లోన్స్, గోల్డ్ లోన్ ఆఫీసర్‌తో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉండి, అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ?
బ్రాంచ్ మేనేజర్,అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్,అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-లోన్స్,అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-కలెక్షన్స్ ,గోల్డ్ లోన్ ఆఫీసర్,క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడైంది.
పోస్టులు మరియు ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు - 113
బ్రాంచ్ మేనేజర్ పోస్టులు- 09
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్ - 23
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-రుణాలు - 23
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-కలెక్షన్స్ - 23
గోల్డ్ లోన్ ఆఫీసర్- 12
క్లర్క్ - 23
వయోపరిమితి
బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-లోన్స్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-కలెక్షన్స్ ఉద్యోగాలకు 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గోల్డ్ లోన్ ఆఫీసర్‌కు 30 ఏళ్ల లోపు వారు,క్లర్క్ ఉద్యోగానికి 28 ఏళ్ల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 30-05-2024
ఇంటర్వ్యూ: ప్రతి సోమవారం మరియు గురువారం వాకిన్ ఇంటర్వ్యూ
ఏ ఉద్యోగాని ఎంత అనుభవం కావాలి !
బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగానికి కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-లోన్స్,గోల్డ్ లోన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత రంగంలో కనీసం 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. క్లర్క్ ఉద్యోగానికి కనీసం 1 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఏ ఉద్యోగానికి ఎంత వేతనం...
బ్రాంచ్ మేనేజర్ : రూ.3.6 లక్షల నుండి 4.2 లక్షల వార్షిక వేతనం + ఇన్సెంటివ్స్
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-సేల్స్ :రూ. 2.4 లక్షల నుండి రూ. 3 లక్షల వార్షిక వేతనం + ఇన్సెంటివ్స్
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్-లోన్స్ : రూ. 2.4 లక్షల నుండి రూ. 3 లక్షల వార్షిక వేతనం + ఇన్సెంటివ్స్
గోల్డ్ లోన్ ఆఫీసర్ :రూ. 2.4 లక్షల నుండి రూ. 3 లక్షల వార్షిక వేతనం + ఇన్సెంటివ్స్
క్లర్క్ : రూ. 1.44 లక్షల నుండి రూ.1.8 లక్షల వార్షిక వేతనం + ఇన్సెంటివ్స్
మరిన్ని వివరాలకు అధికారిక వైబ్‌సైట్ సందర్శించండి. దరఖాస్తు చేసుకునే మందు నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించగలరు
Join Telegram Group:
Whatsapp Channel:
Follow the Job Notifications channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
ఈ నోటిఫికేషన్ సంబంధిచిన పూర్తి వీడియో క్రింది లింకు ద్వారా వీక్షించండి
0 comments:
Post a Comment