AICTE Career Portal: శుభవార్త నిరుద్యోగులకు టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు..

ఇజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఆల్‌ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) కెరీర్ పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేకుండా సొంత టౌన్‌లోనే జాబ్ చేసేందుకు ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది.

ఓ ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్‌ను డిజైన్ చేసింది. నైపుణ్యాలను బట్టి విద్యార్థులు ఈ పోర్టల్‌లో జాబ్‌ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఏఐసీటీఈ ఇప్పటికే పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ పోర్టల్ సహాయంతో విద్యార్థులు సులువుగా జాబ్ తెచ్చుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* రెజ్యూమ్ బిల్డర్ ఫీచర్

ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు మరో బెనిఫిట్ కూడా ఉంది. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొందరు విద్యార్థులు తడబడుతుంటారు. వారి స్కిల్స్‌ను బట్టి ఏయే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనే డౌట్‌లో ఉంటారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్ 'రెజ్యూమ్ బిల్డర్' ఫీచర్‌ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. సీవీకి అవసరమయ్యే వివరాలను

విద్యార్థులు ఎంటర్ చేస్తే చాలు.. ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్ స్టన్నింగ్ రెజ్యూమ్ తయారు చేసి ఇస్తుంది. విద్యార్థులకు కావాల్సిన ఫార్మాట్‌ ఎంచుకోవచ్చు. అదనంగా, కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్లకు కవర్ లెటర్స్‌ కూడా జనరేట్ చేస్తుంది. దీంతో విద్యార్థులకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. క్యాండిడేట్‌పై కూడా కంపెనీకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.

* కంపెనీలు

ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్ విద్యార్థులకు గ్లోబల్ కంపెనీల్లో అవకాశాలను కల్పిస్తోంది. టాప్ కంపెనీలు ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్‌తో లింక్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, జియో, జొమాటో, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు ఇందులో రిజిస్టరై ఉన్నాయి. విద్యార్థులు ఈ కంపెనీల్లోని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ బ్రాంచ్‌లు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో స్థానికంగా అక్కడ ఉద్యోగాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఈ కెరీర్ పోర్టల్‌తో లింక్ చేసుకునే సూచనలు ఉన్నాయి.

ఇంటర్న్‌షిప్ ఛాన్స్

దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కెరీర్ పోర్టల్ లక్ష్యం. పోర్టల్‌లో రిజిస్టర్ అయిన కంపెనీల్లో ఉద్యోగం పొందే అవకాశంతో పాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుంది. ఈ సదుపాయాన్ని విద్యార్థులు వాడుకోవచ్చు. ప్రొఫెషనల్ కెరీర్‌ని డెవలప్ చేసుకోవడంలో ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు ఉపయోగపడతాయి.

* సిలికాన్ వ్యాలీ విజిట్

ఈ కెరీర్ పోర్టల్ విద్యార్థులకు మరో బంపర్ ఛాన్స్ అందిస్తోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని విజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు ఓ కాంపిటిషన్‌ నిర్వహిస్తోంది. ఇందులో పాసైన విద్యార్థులు అక్కడికి వెళ్లి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. తద్వారా గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి కంపెనీల్లో పనిచేసే ఛాన్స్ దక్కుతుంది. దీంతో ఈ కాంపిటిషన్‌పై విద్యార్థులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఈ కాంపిటిషన్‌కి దేశ వ్యాప్తంగా 10 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top