UPSC : 827 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ. 1,77,500 వరకు జీతం

UPSC Combined Medical Services Examination 2024 : న్యూడిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లో 827 మెడికల్ ఆఫీసర్/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 30 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. అలాగే.. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024
మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ పోస్టులు: 163
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే) పోస్టులు : 450
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌) పోస్టులు: 14
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌): 200

ఇతర సమాచారం :
అర్హత: ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి: 1.8.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.56,100-1,77,500గా ఉంటుంది
దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ (100 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2024
దరఖాస్తుల సవరణకు చివరి తేదీ: మే 7, 2024
రాత పరీక్ష తేదీ: జులై 14, 2024

Download Complete Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top