ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024' (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సంక్షిప్త ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత, 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారెవరైనా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది 1,600 ఖాళీలు భర్తీ అయ్యాయి. టైర్-1, టైర్-2 పరీక్షలు, కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఖాళీలు, దరఖాస్తు తేదీల సమాచారం త్వరలో అందుబాటులో రానున్నాయి
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment