కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ (జీడీ) నియామక రాత పరీక్షలకు సంబంధించి (CBT) (Preliminary Key) స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. అనంతరం ఏప్రిల్ చివర లేదా మే నెలలో తుది కీతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆన్లైన్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment