ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త. నేవల్ డాక్‌యార్డ్ ముంబైలో వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మొత్తం 301 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవగా.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి.అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు మే 10 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ indiannavy.nic.in ద్వారా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. 8, 10వ తరగతి పాసైన వాళ్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు విద్యార్హత,వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన ముఖ్య సమాచారం ఇక్కడ ఉంది.
పోస్టుల వివరాలు
ఫిట్టర్-50 పోస్టులు
ఎలక్ట్రీషియన్-40 పోస్టులు
మెకానిక్-35 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26 పోస్టులు
షిప్‌రైట్‌లు (వుడ్)-18పోస్టులు
వెల్డర్లు(గ్యాస్ & ఎలక్ట్రిక్) -15 పోస్టులు
మెషినిస్ట్‌లు-13పోస్టులు
ఎంఎంటీఎం-13పోస్టులు
పైప్ ఫిట్టర్లు-13పోస్టులు
పెయింటర్లు-9 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌లు-7పోస్టులు
షీట్ మెటల్ వర్కర్లు-3పోస్టులు
టైలర్లు-3పోస్టులు
ప్యాటర్న్ మేకర్లు-2పోస్టులు
ఫౌండ్రీమ్యాన్-1 పోస్టుపోస్టులు
మెకానిక్ Ref & A/C-7 పోస్టులు
వయోపరిమితి, విద్యార్హత
అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్టంగా 18 సంవత్సరాలు ఉండాలి. ఇది కాకుండా, ఐటీఐయేతర ట్రేడ్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఫోర్జర్ హీట్ ట్రీటర్ కోసం10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
శారీరక అర్హత
అభ్యర్థి ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, బరువు 45 కిలోల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థి ఛాతీ విస్తరణ తర్వాత 5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే కంటి చూపు 6/6 నుండి 6/9 వరకు ఉండాలి.
ఎంపిక ఎలా జరుగుతుంది?
ఈ పోస్టులపై ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీని తర్వాత అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7700-8050 స్టైఫండ్ లభిస్తుంది.
0 comments:
Post a Comment