Jobs: జాబ్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా? ఈ ఒక్క పని చేస్తే చాలు!

ఈ రోజుల్లో చాలా మంది నిరుద్యోగులు మోసపూరిత ఉద్యోగ ప్రకటనల బారిన పడి మోసపోతున్నారు. ఇలాంటి సమస్యలు లేకుండా యువతకు జాబ్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ అందజేయడానికి కేంద్రం ‘నేషనల్ కెరీర్ సర్వీస్’ పోర్టల్‌ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన అనేక కంపెనీలు ఇందులో రిజిస్టర్ అయ్యాయి. ఇవి ఎప్పటికప్పుడు తమ రిక్రూట్‌మెంట్ సమాచారాన్ని ఈ పోర్టల్ వేదికగా వెల్లడిస్తుంటాయి. నిరుద్యోగ యువత ఈ పోర్టల్ విజిట్ చేసి అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీఎస్ పోర్టల్‌లో నిరుద్యోగులు ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం
నేషనల్ కెరీర్ సర్వీస్(NCS) పోర్టల్ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఉద్యోగ వేటలో ఉన్న యువత NCS పోర్టల్‌ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌సీఎస్ ట్రాక్ రికార్డ్

నేషనల్ కెరీర్ సర్వీస్(NCS) ఇప్పటివరకు 3600+ కెరీర్ ఎంపికలను అందించింది. 53 పరిశ్రమ రంగాల్లోని ఉద్యోగాల సమాచారాన్ని అందించింది. NCS వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 26,27,436 యాక్టివ్ ఎంప్లాయర్స్ లిస్ట్ అయ్యారు. ప్రస్తుతం 12,79,902 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

కెరీర్ సెంటర్స్

నిరుద్యోగ యువత తమ ఆధార్ ఆధారంగా ఈ పోర్టల్‌లో రిజిస్టర్ కావచ్చు. అందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ఉద్యోగార్థులు ఏదైనా కారణం వల్ల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ సాధ్యం కాకపోతే ఎన్‌సీఎస్ కెరీర్ సెంటర్స్ విజిట్ చేసి రిజిస్టర్ కావచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే జాబ్ నోటిఫికేషన్స్, కెరీర్ కౌన్సెలింగ్, జాబ్ ఫెయిర్స్ వంటి వాటిల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ఉపాధి సేవలను పొందవచ్చు

కాల్‌సెంటర్ హెల్ప్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే మల్టిలాంగ్వేజ్ కాల్‌సెంటర్ సహయం పొందవచ్చు. కాల్ సెంటర్స్ ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంటాయి.

* ఉచిత కోర్సుల యాక్సెస్

ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంపొందించుకోవాలి. అందుకు సంబంధించిన ఉచిత కోర్సుల యాక్సెస్‌ను ఎన్‌సీఎస్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. అలాగే వివిధ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్ అవకాశాలను తెలుసుకోవచ్చు.

* రిజిస్ట్రేషన్ ప్రాసెస్

-ముందుగా NCS పోర్టల్ www.ncs.gov.in ను ఓపెన్ చేయాలి.

హోమ్‌పేజీలోకి వెళితే, కుడి వైపున లాగిన్ ఆప్షన్ కనపడుతుంది. దాని కింద ‘సైన్ ఇన్’, ‘సైన్ అప్’ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ టైమ్ యూజర్స్ ‘సైన్ అప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ డ్రాప్ డౌన్‌ ఆప్షన్ ట్యాప్ చేసి ‘రిజిస్టర్ యాజ్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత, డ్రాప్-డౌన్ లోనే ‘జాబ్ సీకర్‌’ అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి.

అన్ని వివరాలు మరోసారి చెక్ చేయాలి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత ‘నేను నిబంధనలు, షరతులకు అంగీకరిస్తున్నాను’ అనే చెక్‌బాక్స్‌పై టిక్ చేసి, సబ్‌‌మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో రిజిస్టర్ ప్రాసెస్ పూర్తవుతుంది.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కౌన్సెలింగ్, వృత్తిపరమైన విషయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌లపై సమాచారాన్ని అందించే నేషనల్ కెరీర్ సర్వీస్‌ను కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చింది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top