Hyderabad ECIL Recruitment 2024: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 13 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది
ముఖ్య సమాచారం :
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు: 30
విభాగాల వారీ ఖాళీలు: ఈసీఈ- 5, ఈఈఈ- 7, మెకానికల్- 13, సీఎస్‌ఈ- 5 ఖాళీలున్నాయి.
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (13.04.2024 నాటికి): 27 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 - 1,40,000గా ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2024
0 comments:
Post a Comment