Hyderabad : ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో టెక్నీషియన్ జాబ్స్‌.. నెలకు రూ.20,480 జీతం

Hyderabad ECIL Technician Jobs 2024 : హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. మరో జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అయితే.. ఏప్రిల్‌ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు. అలాగే.. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ఇతర సమాచారం :

టెక్నీషియన్ (గ్రేడ్-2) పోస్టులు: 30

ట్రేడుల వారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 7, ఎలక్ట్రీషియన్- 6, మెషినిస్ట్‌- 7, ఫిట్టర్- 10 ఖాళీలున్నాయి.

అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్/ మెషినిస్ట్‌ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 13/04/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.20,480 జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్‌ 13, 2024


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top