AAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య; 490
* జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3
అర్హత:ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు కలిగి ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్టరై ఉండాలి.
GATE 2024 పరీక్ష పేపర్: ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, గేట్ పేపర్ కోడ్- AR.
వయోపరిమితి:01.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుం
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్-సివిల్): 90
అర్హత:సివిల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు కలిగి ఉండాలి.
GATE 2024 పరీక్ష పేపర్: సివిల్ ఇంజినీరింగ్, గేట్ పేపర్ కోడ్- CE.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్): 106
అర్హత:ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు కలిగి ఉండాలి.
GATE 2024 పరీక్ష పేపర్: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, గేట్ పేపర్ కోడ్- EE.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278
అర్హత:ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు కలిగి ఉండాలి.
GATE 2024 పరీక్ష పేపర్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, గేట్ పేపర్ కోడ్- EC.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13
అర్హత:కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు కలిగి ఉండాలి.
GATE 2024 పరీక్ష పేపర్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గేట్ పేపర్ కోడ్- CS.
వయోపరిమితి:01.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:గేట్- 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీత భత్యాలు:నెలకు రూ.40,000-1,40,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.04.2024.
🔰 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2024.
0 comments:
Post a Comment