TCS recruitment: వివిధ పొజిషన్స్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్స్ నుంి దరఖాస్తులు కోరుతోంది. ఇటీవలి కాలంలో పలు ఐటీ సంస్థల్లో నియామకాలు మందగించాయి. 2024లో బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్ పూర్తి చేస్తున్న బ్యాచ్ నుంచి టీసీఎస్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 10. రిక్రూట్మెంట్ కు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 26న జరుగుతుందని కంపెనీ వెబ్ సైట్ కెరీర్ పేజీలో పేర్కొన్నారు.
ఏయే కేటగిరీల్లో నియామకాలు? వేతనం ఎంత?
ప్రస్తుతం నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో టీసీఎస్ (TCS) నియామకాలు చేపడుతోంది. వీటిలో నింజా కేటగిరీ లో ఉద్యోగం సాధించినవారికి ఏడాదికి రూ.3.36 లక్షలు, డిజిటల్ కేటగిరీలో జాబ్ పొందిన వారికి ఏడాదికి రూ. 7 లక్షలు, ప్రైమ్ కేటగిరీ లో రిక్రూట్ అయినవారికి ఏడాదికి రూ.9-11.5 లక్షల వేతనం లభిస్తుందని టీసీఎస్ వెల్లడించింది.
టీసీఎస్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు?
అయితే, ఈ రిక్రూట్మెంట్ (TCS recruitment) ద్వారా ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే విషయాన్ని కానీ, మొత్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వనున్నారన్న విషయాన్ని కానీ టీసీఎస్ (TCS) వెల్లడించలేదు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని ఆఫర్ లెటర్స్ వస్తాయో వేచి చూడాల్సిందే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫ్రెషర్లను నియమించే ప్రక్రియ ప్రారంభమైందని కంపెనీ జనవరిలో తెలిపింది. అయితే, ఈ సంస్థ ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్లను ప్రారంభించింది. వచ్చే ఏడాదికి క్యాంపస్ రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించామని, టీసీఎస్ లో చేరేందుకు ఫ్రెషర్స్ లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోందని టీసీఎస్ చీఫ్ హెచ్ ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
60 వేల జాబ్స్
2023-24 ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఫిబ్రవరిలో తెలిపింది. "కోవిడ్ సంవత్సరంలో చాలా ఎక్కువగా నియామకాలు జరిగాయి. అందువల్ల, ఆ తరువాత కొంత కరెక్షన్ చోటు చేసుకుంది.
0 comments:
Post a Comment