NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 335 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

NPCL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌భట రాజస్థాన్ సైట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.7,700 - రూ.8,855 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 335 ఖాళీలు.

పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 56, ఎస్టీ- 43, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)- 67, ఈడబ్ల్యూఎస్‌- 33, యూఆర్‌(జనరల్)- 136.

శిక్షణ కాలం: ఏడాది.

ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్.

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 14 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

స్టైపెండ్: నెలకు రూ.7,700 - రూ.8,855.

‌ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరితేది: 04.04.2024.

Download Complete Notification


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top