న్యూదిల్లీలోని ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
* అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1): 100 పోస్టులు
విభాగాలు: అకౌంట్స్, అక్చూరియల్, ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ (ఐటీ), మెడికల్ ఆఫీసర్, లీగల్,
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ బీడీఎస్, డిగ్రీ (లా), ఐసీఏఐ / ఐసీడబ్ల్యూఏఐ / బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్), బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం:.50925 - 96,765.
వయో పరిమితి: 31-12-2023 నాటికి 21 నుంచి 30 మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠంగా అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21-03-2024.
దరఖాస్తు చివరి తేది: 12-04-2024
రాత పరీక్ష తేది: మే/ జూన్లో.
0 comments:
Post a Comment