OICL AO Recruitment 2024: ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 100 ఆఫీసర్‌ జాబ్స్‌.. ఉండాల్సి అర్హతలివే

The Oriental Insurance Recruitment 2024 : ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ స్కేల్‌-1 క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులను మూడు దశల్లో జరిగే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ 31, 2023 నాటికి అభ్యర్థుల వయసు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులకు 8 ఏళ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://orientalinsurance.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
పోస్టుల వారీగా విద్యార్హతలివే :
అకౌంట్స్‌-20: 31.12.2023 నాటికి బీకామ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం సరిపోతుంది. లేదా ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణులు కావాలి. లేదా ఐసీఏఐ నుంచి కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ పూర్తిచేయాలి.
యాక్చూరియల్‌-5: స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ యాక్చూరియల్‌ సైన్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం. లేదా స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ యాక్చూరియల్‌ సైన్స్‌ మాస్టర్‌ డిగ్రీ చదవాలి.
ఇంజినీరింగ్‌-15: బీఈ/ బీటెక్‌ ఇన్‌ ఆటోమొబైల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ కెమికల్‌/ పవర్‌/ ఇండస్ట్రియల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా ఎంఈ/ఎంటెక్‌ ఇన్‌ ఆటోమొబైల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ కెమికల్‌/ పవర్‌/ ఇండస్ట్రియల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ చేయాలి.
ఇంజినీరింగ్‌ (ఐటీ)-20: బీఈ/ బీటెక్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. లేదా ఎంఈ/ ఎంటెక్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పాసవ్వాలి.
మెడికల్‌ ఆఫీసర్‌-20: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ లేదా తత్సమాన విదేశీ డిగ్రీలు పూర్తిచేయాలి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌లో రిజిస్టర్‌ కావాలి.
లీగల్‌-20 : లా డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం సరిపోతుంది.

ముఖ్య సమాచారం :
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250తో పాటు జీఎస్టీ అదనం. ఇతరులకు రూ.1000తో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్‌-1లో ప్రిలిమినరీ, ఫేజ్‌-2లో మెయిన్స్, ఫేజ్‌-3లో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో.. విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.. తెలంగాణలో: హైదరాబాద్‌/రంగారెడ్డి, వరంగల్‌ నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 21, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2024

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top